నన్ను చంపెందుకు అధికార పార్టీ కుట్ర.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

తనను హత్య చేయడానికి అధికార పార్టీ భారీ కుట్ర చేసిందంటూ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధి కొర్రెములలోని జేకే కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన ‘తీన్మార్‌ మల్లన్న టీం భవిష్యత్‌ కార్యాచరణ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టడాానికి అధికార పార్టీ, ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా వందల కేసులు పెట్టి 74 రోజులు జైలుకు పంపిందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజుల పాత నేరస్తులతో తనను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణాలతో భయటపడ్డానని తెలిపారు. మరుసటి రోజు మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు ఇచ్చి పిచ్చివాడిగా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు.

తాను జైలు నుంచి రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. జైలు నుంచి రావడానికి కొందరి వ్యక్తుల సహకారం తో పాటు కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం వాస్తవమే అన్నారు. తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న టీం అభిప్రాయాలను తీసుకుని కొత్త పార్టీ పెట్టడమా.. వేరే పార్టీలో చేరడమా..అనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.