విజయ్ సినిమాలకు అక్కడ మంచి గిరాకి..!

-

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్ది, గీతా గోవిందం, టాక్సీవాలా ఈ నాలుగు హిట్లతోనే టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. పస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్న విజయ్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ సినిమాలకు బాలీవుడ్ లో బీహ్బత్సమైన క్రేజ్ పెరుగుతుంది.

ఆల్రెడీ అర్జున్ రెడ్డి సినిమా అక్కడ రీమేక్ అవుతుంది. మాత్రుక దర్శకుడు సందీప్ వంగ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, కియరా అద్వాని అర్జున్ రెడ్డి రీమేక్ గా వస్తున్న కబీర్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు లాస్ట్ ఇయర్ సూపర్ హిట్టైన విజయ్ దేవరకొండ మరో మూవీ గీతా గోవిందం సినిమా కూడా బాలీవుడ్ రీమేక్ అవబోతుంది.

దఢక్ సినిమాలో నటించిన ఇషాన్ కట్టర్ హింది గీతా గోవిందంలో నటిస్తాడని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా గోవిందం హింది రీమేక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి విజయ్ సినిమాలు అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news