చిరంజీవి టైటిల్ కు ఎసరు పెట్టాడు

-

యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ట్రై లింగ్వల్ మూవీ ఒకటి సైన్ చేశాడట. ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్ గా నటిస్తాడని తెలుస్తుంది.

ఆనంద్ అన్నమలై డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తారని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఇక ఈ సినిమా టైటిల్ గా హీరో అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ అయిన హీరో టైటిల్ ను విజయ్ వాడేస్తున్నాడు. రీసెంట్ గా చిరు గ్యాంగ్ లీడర్ టైటిల్ ను నాని వాడేశాడు. ఇప్పుడు విజయ్ హీరో అవుతున్నాడు. ఈ రెండే కాకుండా కార్తి హీరోగా వస్తున్న ఓ తమిళ సినిమాకు ఖైది అని టైటిల్ పెడుతున్నారట. మొత్తానికి మెగాస్టార్ టైటిల్స్ తో వస్తున్న ఈ సినిమాలు ఎలాంటి హంగామ చేస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news