ఈగ ఫేం కిచ్చ సుదీప్.. ఉద్ఘర్ష ట్రైలర్… అదిరిపోయిన సస్పెన్స్…!

-

వామ్మో..ఇదేం ట్రెయిలర్ రా బాబోయ్. సస్పెన్స్ థ్రిల్లర్ కే అమ్మ మొగుడిలా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే దానికి కేరాఫ్ అడ్రస్ కన్నడ దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్. ఆయన డైరెక్షన్ లో వస్తున్న మరో మూవీ ఉద్ఘర్ష. థాకూర్ అనూప్ సింగ్, సాయి ధన్సిక, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈగ ఫేం కిచ్చ సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. కిచ్చ సుదీప్ వాయిస్ తో ఈ సినిమా ట్రైలర్ అంతా నడుస్తుంది.

Udgharsha Telugu Trailer

కన్నడతో పాటు తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆధ్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుంది సినిమా ట్రైలర్.

Udgharsha Telugu Trailer

ట్రైలర్ లోనే ఓ హత్యను చూపిస్తారు. ఆ హత్య ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. అసలు.. హత్యకు, మిగితా వాళ్లకు సంబంధమేంది.. అనేది సస్పెన్స్ గా చూపించాడు డైరెక్టర్.

Read more RELATED
Recommended to you

Latest news