విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లి.. మళ్లీ మొదలుపెట్టేశారు..!

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఇప్పటికే రెండు సినిమాలు తీయడం జరిగింది. తను చేసే ప్రతి సినిమా రిలీజ్ టైంలో నిహారిక మీద ఓ రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అదేంటి అంటే నిహారిక పెళ్లి మ్యాటర్. ప్రతి సినిమా రిలీజ్ టైంలో నిహారిక మీడియా ముందుకొస్తే అడిగే మొదటి ప్రయత్న పెళ్లెప్పుడనే.. ఈమధ్య నాగబాబు కూడా నిహారికకు ఇచ్చిన టైం అయిపోయిందని త్వరలో పెళ్లే అంటూ చెప్పుకొచ్చాడు.

నిహారిక మొదటి సినిమా హీరో నాగ శౌర్యతో పెళ్లంటూ కొద్దిరోజులు వార్తలు రాశారు.. ఆ తర్వాత ప్రభాస్ కు ఆమెకు లింక్ పెట్టారు. లేటెస్ట్ గా ముద్దుల హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లంటూ కొత్త రూమర్ వినిపిస్తుంది. నిహారిక, విజయ్ దేవరకొండ అసలు కలిసి సినిమా చేసింది కూడా లేదు.. కలిసింది కూడా లేదు కాని ఇద్దరి పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ మెగా సపోర్ట్ ఉంది.. అది నిహారికతో పెళ్లి కోసమే అంటూ టాక్. అయితే ఈ వార్తల్లో వాస్తవ ఎంతన్నది పక్కన పెడితే ఇలా నిహారికని అందరితో కలపడం మాత్రం దారుణమని చెప్పొచ్చు. ప్రస్తుతం సూర్యకాంతం సినిమా చేసిన నిహారిక మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.