వాయిదా పడిన విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ..కారణం అదేనా?

-

ఈ ఏడాది జులై నెల టాలీవుడ్ కి ఎంత పెద్ద పీడ కలగా మారిందో, ఆగస్టు నెల అంత మంచి గోల్డెన్ నెల గా మారింది..ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ ఒక్కదానిని మించి ఒకటి సూపర్ హిట్ గా నిలుస్తూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది..మధ్యలో వచ్చిన నితిన్ మాచెర్ల నియోజకవర్గం సినిమా ఒక్కటే నిరాశ పరిచింది..ఆ ఒక్క సినిమా మినహా ఈ నెలలో విడుదలైన భింబిసారా , సీతారామం మరియు కార్తికేయ 2 వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామి ని సృష్టించాయి..ఇప్పుడు అదే జోష్ ని మరో రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న విజయ దేవరకొండ లైగర్ సినిమా కూడా కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టి నమ్మకం తో ఉన్నాయి..పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసిన ప్రతి చోట అద్భుతంగా ఉన్నాయి..ప్రస్తుతం నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని గమనిస్తుంటే ఈ సినిమా కి స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ పక్కా అని అర్థం అయిపోతుంది.

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారు..అంతే కాకుండా ఈ సినిమా సెకండ్ హాఫ్ కి ఇండస్ట్రీ లో మంచి టాక్ కూడా ఉంది..అయితే ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన కాకుండా ఆగస్టు 26 వ తేదీన విడుదల అవ్వబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్..కానీ అది తెలుగు లో కాదు..హిందీ లో..ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో ఇటీవల కాలం లో గురువారం నాడు విడుదలైన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొట్టాయి..ఈ బాడ్ సెంటిమెంట్ ప్రస్తుతం బాలీవుడ్ లో గట్టిగ నడుస్తుండడం తో ఈ సినిమాని అక్కడ 25 వ తారీఖున కాకుండా 26 వ తేదీన..అనగా శుక్రవారం రోజు విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది..విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.

విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ తో పాటు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..దాంతో ఈ సినిమాకి అక్కడ హైప్ వేరే లెవెల్ లో ఉంది..ఇటీవలే అక్కడ బాలీవుడ్ బడా హీరోల సినిమాలన్నీ విడుదలయ్యి ఒకదానిని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలుస్తున్న సమయం లో మన టాలీవుడ్ నుండి హిందీ కి దబ్ అయ్యి వెళ్లిన కార్తికేయ 2 చిత్రం ప్రభంజనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే..అంతే కాకుండా గత ఏడాది డిసెంబర్ నుండి నేటి వరుకు అక్కడ బాలీవుడ్ హీరోల సినిమాలకంటే మన సౌత్ ఇండియన్ సినిమాలే కుమ్మేస్తున్నాయి..ఇప్పుడు లైగర్ సినిమాకి కూడా టాక్ వస్తే బాలీవుడ్ లో వసూళ్ల సునామి ని సృష్టించడం ఖాయం అని చెప్పొచ్చు..చూడాలి మరి ఈ సినిమా అనుకున్న విధంగా బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేస్తుందో లేదో అనేది.

Read more RELATED
Recommended to you

Latest news