కారుకు కొత్త తలనొప్పి…కోవర్టులు ముంచేస్తారా?

-

ఏదేమైనా గాని మునుగోడులో బీజేపీ దూకుడు మీద ఉంది…జీరో నుంచి మొదలుపెట్టి బలాన్ని అంచలంచెలుగా పెంచుకుంటూ వెళుతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలని దెబ్బకొడుతూ…గెలుపు దిశగా వెళుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకుని మునుగోడులో పార్టీ బలాన్ని పెంచుకుంది..అలాగే టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులని లాగేస్తూ గెలుపు దిశగా ముందుకెళుతుంది. ఇప్పటికే పలువురు సర్పంచ్‌లని, పరిషత్ నాయకులని లాగేసింది.

అయితే కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉండటంతో తమ నేతలు వలస వెళ్లకుండా అపలేకపోతుంది. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం…తమ అధికార బలాన్ని ఉపయోగించి..తమ నాయకులని బీజేపీ వైపు వెళ్లకుండా ఏదొక విధంగా అడ్డుకుంటుంది. ఇప్పటికే పలువురు నేతలపై ఉన్న కేసులని అడ్డం పెట్టుకుని, వారిపై పోలీసులని ప్రయోగిస్తుంది. అలాగే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వమని చెప్పి కొందరిని నిలువరిస్తున్నారు. అసలు పార్టీ తరుపున పనిచేయకపోయిన పర్లేదు…కానీ బీజేపీకి పనిచేయకుండా సైలెంట్ గా కూడా ఉండేందుకు కొందరికి ఆర్ధికంగా అండగా నిలబడుతున్నట్లు తెలుస్తోంది.

పార్టీ మారిపోకుండా సొంత వాళ్ళకు డబ్బులు పంచాల్సిన పరిస్తితి వచ్చింది. అలాగే కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వమని చెప్పి సొంత నేతలని  బెదిరించి పార్టీలోనే ఉండేలా చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండేలా లేదు. ఎందుకంటే కొందరు నేతలు టీఆర్ఎస్ లో ఉంటూనే..పరోక్షంగా బీజేపీ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కోవర్టులుగా మరి కోమటిరెడ్డి విజయానికి కృషి చేసేలా ఉన్నారు.

పైగా కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు…కానీ తమని పట్టించుకోవడం లేదని కొందరు టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు…పైగా అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని చాలామంది టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే కొందరు టీఆర్ఎస్ అధిష్టానం ఒత్తిళ్లకు తట్టుకోలేక, పార్టీ మారకపోయినా, పరోక్షంగా పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే కోవర్టులతో కారు మునుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news