అభిమానులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. మీరూ ఉన్నారా..?

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సపరేటు స్టార్డం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అభిమానులతో నడుచుకునే తీరులోనూ తన రూటే సపరేట్ అని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా తన అభిమానులలో జోష్ నింపడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులను అవలంబించే ఈయన ఐదేళ్ల క్రితమే ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. దేవరసంతా క్యాంపెయిన్ పేరుతో ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగకు.. కొత్త సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ వంద మంది అభిమానులను రాండంగా ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తూ వస్తున్నాడు.

దాదాపు ఐదేళ్ల క్రితం తాను మొదలుపెట్టిన ఈ ట్రెడిషన్ ను ఈ సంవత్సరం ఇంకాస్త కొత్త స్టైల్ ని అవలంబిస్తూ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఈ ఏడాది ఒక 100 మంది అభిమానులను హాలిడే ట్రిప్ కి పంపించనున్నట్టు స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మీలో ఒక వందమంది అభిమానులకు అవకాశం దక్కుతుందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు అయితే ఆ హాలిడే ట్రిప్పులో అభిమానులకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని కూడా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా అక్కడకు వెళ్లి రావడానికి టికెట్స్ తో పాటు హోటల్ , ఫుడ్ అండ్ బేవరేజెస్ , పార్టీలు, షికార్లు ఇలా అభిమానులు ఎంజాయ్ చేసే ప్రతి ఖర్చు తనదేనని కూడా విజయ్ దేవరకొండ తెలిపాడు. అయితే ఈ హాలిడే ట్రిప్పు ఎక్కడి వరకు ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో మీరే చెప్పండి అంటూ అభిమానులకి ఆ ఛాన్స్ వదిలేసాడు. అయితే అందులో మీరు ఉన్నారేమో ఒకసారి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news