తెలుగులో డైరెక్టు సినిమా చేస్తున్న విజ‌య్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

త‌మిళ హీరోకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తున్నాయి. కానీ ఆయ‌న ఇంత వ‌ర‌కు తెలుగులో డైరెక్టుగా సినిమా చేయ‌లేదు. కేవ‌లం త‌మిళం తీసిని సినిమాల‌నే ఇక్క‌డ డ‌బ్ చేస్తూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల కోసం నేరుగా తెలుగులో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు.

ప్ర‌స్తుతం కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు విజ‌య్‌. ఇక దీని త‌ర్వాత తెలుగులో సినిమా చేయ‌నున్నారు. అందుకోసం బ‌డా డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టాడు విజ‌య్‌.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి విజ‌య్‌కు ఓ క‌థ వినిపించాడు. దీనికి విజ‌య్ కూడా ఓకే చెప్పేశాడు. దీంతో త్వరలోనే విజయ్ తో తెలుగులో సినిమా చేయనున్నాడు వంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ.. తాను విజ‌య్‌తో చేయ‌బోయే సినిమా ఆయ‌న‌కు 66వ సినిమా అని చెప్పారు. విజ‌య్ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా పూర్త‌వ‌గానే త‌మ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని వంశీ చెప్పాడు.