ఈటల రాజేందర్ చుట్టూ ఇప్పుడు హాట్ పాలిటిక్స్ నెలకొన్నాయి. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో
చేరతారో అని అంతా ఆసక్తిగా ఎదరుచూశారు. వరుసగా కాంగ్రెస్, బీజేపీ నేతలను కలవడంతో గందరగోళం నెలకొంది. కానీ ఫైనల్‌గా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నిన్న ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే దీనిపై టీఆర్ ఎస్ స్పందించింది.
టీఆర్ఎస్ ముఖ్యనేత, సీఎం కేసీఆర్ వర్గంలో ఒకరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల పార్టీ లైన్ దాటి బీజేపీని కలిశారని, దీనిపై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య అవసరమనుకుంటే ఆ చర్య తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌లను కలిశానని చెబుతున్నారని, మరి అప్పుడు తన ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ముందు నుంచి బహుజనవాదం, వామపక్షవాదం ఉన్న నేత అని, మరి ఇప్పుడు వాటిని ఎలా వదిలి బీజేపీలో చేరుతారని మండిపడ్డారు. అయితే ఈటలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే అలా చేస్తే ఈటలకు సానుభూతి పెరుగుతుందని కేసీఆర్ యోచిస్తున్నారు. మరి చర్యలు ఉంటాయా లేదా చూడాలి.