ఆదిపురుష్‌కు ధీటుగా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సీత‌.. స‌రికొత్త కోణంలో క‌థ‌!

-

రచ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ గుర్తున్నారు క‌దా అదేనండి బాహుబ‌లి, ఆర్ ఆర్ ఆర్ సినిమాల‌కు క‌థ రాసిన రాజ‌మౌలి తండ్రి. ఆయ‌న ర‌చ‌యిత‌గా ఎంతో ఫేమ‌స్‌. ఇప్పుడు ఆయ‌న ఓ ప్ర‌ముఖ ప్రాజెక్టును లైన్‌లో పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రామాయ‌ణం బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు డార్లింగ్ ప్ర‌భాస్ కూడా ఆదిపురుష్తో వ‌స్తున్నారు.

అయితే ఇప్పుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా రామాయ‌ణం సీత: ది ఇంకార్నేషన్ అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆయ‌న కేవ‌లం కథ – స్క్రీన్ ప్లే మాత్ర‌మే అందిస్తున్నారు. ఈమూవీకి అలౌకిక్ దేశాయి దర్శకత్వం చేస్తున్నారు.

ఇంత వ‌ర‌కు చూడని స‌ర‌కొత్త కోణంలో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటి వరకు వ‌చ్చిన సినిమాల్లో ఉన్న సీత‌ను కాకుండా స‌రికొత్త విధంగా సీత క్యారెక్ట‌ర్‌ను చూపించాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ భావిస్తున్నారంట‌. సీత పాత్రలో కరీనా కపూర్ లేదా ఆలియా భట్ లలో ఒకరిని తీసుకుంటార‌ని స‌మాచారం. అలాగే రావ‌ణుడి పాత్ర‌లో రణ్ వీర్ సింగ్ అయితే బాగుంటుంద‌ని టీం ఆలోచిస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికార‌ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news