ఫైవ్ ఫ్యాక్టర్ ఫుడ్: రోజులో ఐదుసార్లు ఆహారం.. బరువు తగ్గడానికి సరికొత్త జీవనశైలి.

-

బరువు తగ్గడానికి రకరకాల ఆహార అలవాట్లు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి నచ్చింది వారు పాటిస్తారు. ప్రస్తుతం సరికొత్తగా ట్రెండింగ్ లోకి వచ్చిన కొత్త ఆహార అలవాటు ఫైవ్ ఫ్యాక్టర్ ఫుడ్. 5వారాల డైట్ ప్లాన్ లో భాగంగా రోజుకి ఐదు సార్లు ఆహారం తీసుకోవడం దీని ప్రత్యేకత. ఆ ఐదు సార్లు కూడా ఐదు విభిన్నమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒకసారి ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రోటీన్, ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ ఆహార పద్దతి పోషకాహారాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఆహారాలతో పాటు ఐదు విభిన్నమైన వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.

ఇందులోని ఆహార పదార్థాలు గ్లిసమిక్ సూచీ తక్కువగా ఉంటాయి. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అనవసర ఆకలి తగ్గుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఐదు సార్లు తినడం వల్ల అనవసరమైన ఆకలి తగ్గిపోయి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఈ డైట్ ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుందంటే

జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి పనికొస్తుంది.
చక్కెర స్థాయిలని నియంత్రించి అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

తక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న చేపలు, గుడ్డులోని తెల్లని భాగం, చర్మంలేని చికెన్ మొదలగునవి.
కార్బోహైడ్రేట్లు అయిన బఠాణీలు, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలగునవి.
పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు
ఆరోగ్యకరమైన కొవ్వులు అనగా చేపలో దొరికే ఒమేగా 3కొవ్వులు, అవొకొడో, గింజలు, విత్తనాలు, అలివ్ ఆయిల్ మొదలగునవి.
ద్రవ పదార్థాలైన మంచినీళ్ళు, తియ్యగా లేని టీ లేదా డైట్ సోడా..

కేవలం ఆహారమే కాదు వ్యాయామం చేస్తే కూడా బాగుంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని రూపొందించుకోవాలనుకునే వారు కూడా ఇది పాటించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news