ఫైటర్ లో విజయ్ ది డ్యూయల్ రోల్ …?

-

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన పూరి లాక్ డౌన్ తో అన్ని సినిమాలతో తన సినిమాని నిలిపివేశాడు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ అన్న బ్యానర్స్ లో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

 

 

ఇక త్వరలో ఈ సినిమాని మొదలు పెట్ట బోతున్నారట పూరి. అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నారట. కేవలం ఈ షెడ్యూల్ లో సాంగ్స్ వరకు కంప్లీట్ చేస్తారని సమాచారం. హీరో విజయ్ దేవరకొండ మీద సోలో సాంగ్ తో పాటు..విజయ్ దెవరకొండ అనన్య పాండే ల మీద ఒక రొమాంటిక్ సాంగ్స్..మరొక సాంగ్ కంప్లీట్ చేసేందుకు హైదరాబాద్ స్టూడియోస్ లో సెట్స్ ని నిర్మించి ఉంచారట.

అయితే తాజా విజయ్ దేవరకొండకి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటో విజయ్ దేవరకొండ ఫైటర్ లో నటిస్తున్న మరో క్యారెక్టర్ కి సంబంధించినదన్న టాక్ మొదలైంది. ఫైటర్ లో విజయ్ ది డ్యూయల్ రోల్ అని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే క్యారెక్టర్ లుక్ ఇదేనని ..ప్రస్తుతం పూరి ఈ గెటప్ తోనే విజయ్ మీద సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ప్రస్తుతం విజయ్ కనిపిస్తున్న ఈ లుక్ మాత్రం చాలా అట్రాక్ట్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news