యంగ్ టైగ‌ర్ తో లేడీ సూప‌ర్ స్టార్‌.. కాంబినేష‌న్ మామూలుగా ఉండ‌దు

విజ‌య‌శాంతి.. ఈ పేరుకు ఎన్నో మారు పేర్లు ఉన్నాయి. లేడీ సూప‌ర్ స్టార్ అని, సివంగి అని, ఆడ పులి అని ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఒక‌ప్పుడు విజ‌య‌శాంతి సినిమా వ‌స్తోందంటే పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా ప‌డ్డ సంద‌ర్భాలు ఉన్నాయి. అంటే ఆమెకు ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక సుధీర్ఘ 13ఏళ్ల విరామం త‌ర్వాత ఆమె స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీలో ఆమె భార‌తి సినిమాలో ఎంత బాగా న‌టించిందో అంద‌రికీ తెలిసిందే. ఈమె నటించ‌డంతో ఈ సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చింది.


ఇక ఇప్పుడు నంద‌మూరి స్టార్ హీరో ఎన్టీఆర్ తీయ‌బోయే సినిమాలో న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ అంటేనే ఊర మాస్‌. అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన కొరటాలపై న‌మ్మ‌కంతో త‌న 30 సినిమాను మొద‌లు పెట్టాడు తార‌క్‌. వీరి సినిమాలో ఓ వ‌ప‌ర్‌ఫుల్ రోల్ కోసం విజ‌య‌శాంతిని తీసుకుంటున్నార‌ని మూవీ వ‌ర్గం చెబుతోంది. ఆమె కోసం పాత్ర‌లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడంట సుకుమార్‌.
మామూలుగానే ఎన్టీఆర్ మూవీ అంటే మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అనివార్యం. ఇక కొర‌టాల విష‌యానికి వ‌స్తే.. ఆయన క‌థే ఎవ‌రికీ అంద‌ని స్థాయిలో ఉంటుంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయ‌డంలో దిట్ట అయిన కొరటాల‌.. విజ‌య‌శాంతితో ఎలాంటి మెస్మ‌రైజ్ ప్లాన్ చేస్తున్నాడో అని అటు ఆమె అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు లెక్క‌లు వేసుకుంటున్నారు. కొరటాల త‌న ట్విట్ట‌ర్ లో ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ రాసుకొచ్చాడంటేనే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.