ఈ కరోనా సెకండ్ వేవ్ లో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి…!

-

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇబ్బందులు తీసుకొస్తోంది. ఈ వైరస్ కారణంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా అనుసరించడం మంచిది.

ధూమపానానికి దూరంగా ఉండండి:

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఆ అలవాటును మానుకోలేరు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఊపిరితిత్తులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. లంగ్ క్యాన్సర్ లాంటి ప్రమాదం కూడా సంభవించవచ్చు. కాబట్టి ధూమపానం కి దూరంగా ఉంటే ఆస్తమా, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండొచ్చు.

బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యండి:

ఊపిరితిత్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రాణాయామం చేయడం మంచిది ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు మరియు రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ప్రాణాయామం లాంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ ఫ్లో కి కూడా ఇది ఉపయోగపడుతుంది.

కాలుష్యానికి దూరంగా ఉండండి:

కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా కాలుష్యం ఉంటుంది. ఇంట్లో ఎవరైనా స్మోక్ చేసినా లేదా కెమికల్స్ మరియు మట్టి, దుమ్ము కారణంగా కూడా కాలుష్యం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

ఫిజికల్ యాక్టివిటీ:

ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యం కనీసం రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.

పోషకాహారం తీసుకోండి:

ఆరోగ్యకరమైన ఆహారం అంటే పండ్లు కూరగాయలు ఇలాంటివి తీసుకుంటే మంచిది. దీని వల్ల మరెంత ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news