వైర‌ల్ ఎటాక్ : బేబ‌మ్మా నా మాట విను స్మోక్ చేయ‌కు !

-

శ్యామ్ సింగ‌రాయ్ సినిమా హిట్టా ఫట్టా అని అడ‌గ‌కండి కానీ ఒక చ‌ర్చ‌కు మాత్రం తావిచ్చే స‌న్నివేశం ట్రైల‌ర్ క‌ట్స్ లో ఉంది.ఆ ఒక్క సీన్ తో బేబ‌మ్మ మ‌రోమారు హైలెట్ అయిపోయింది. నిండా ఇర‌వై ఏళ్లు నిండ‌ని కృతీశెట్టి ఆ విధంగా స్మోక్ చేయ‌డంతో ఆ సినిమా రిలీజుకు ముందే కొంత గ‌లీజు టాక్ తెచ్చేసుకుంది. కానీ మోడ్ర‌నిటీ అన్న‌ది ఒక‌టి ఉంటుంది క‌దా! ఆ ముసుగులోనో లేదా లొసుగులోనో అమ్మాయిలు ఏమ‌యినా చేయ‌వ‌చ్చు.

ఎంతైనా వాగొచ్చు. తాగొచ్చు. తూలొచ్చు.. గుండె నిండా పొగ పీల్చి వ‌ద‌ల‌నూ వ‌చ్చు. క‌నుక సెల‌బ్రేష‌న్ ఆఫ్ లైఫ్ అంటే ఇదే అని అర్థం చేసుకుని కొన్ని అల‌వాట్ల‌కు కూడా జెండ‌ర్ డిస్క్రిమ‌నేష‌న్ అన్న‌ది ఉండ‌దు అని ఫైన‌ల్ గా డెసిష‌న్ కు రావాలి. రావాలి కాదు వ‌చ్చేలా చేసేదే సినిమా! లేదా క‌ళ్లెదురుగా ఉన్న రేప‌టి లోకం కూడా! క‌నుక బేబ‌మ్మ అపార్థాల‌కు తావిచ్చే ప‌నికిమాలిన ప‌నులు ఇక‌పై చేయ‌కు..అన్న‌ది మా విన్న‌పం. బికాజ్ స‌మ్ అద‌ర్ క‌ల్చ‌ర్ ఈజ్ నాట్ మెంట్ ఫ‌ర్ అజ్. బ‌ట్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ ఈజ్ స్పీక్స్ వెల్ ….జ‌స్ట్ యూ ఫాలో ఇట్..

ఆనందాన్ని ఎవ‌రు కోరుకోరు అని అంటారు సినిమా మొద‌ల‌వ్వ‌గానే..పొగాకు మా జీవితాల‌ను ఛిద్రం చేసింది అని అంటారు. క్యాన్స‌ర్ కార‌ణంగా నా భార్య రెండు బంగారు గాజులు అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ని వేద‌న చెందుతాడు ఇంకొక‌రు.ఇవ‌న్నీ ఏమ‌యినా మేల్కొల్పుతున్నాయా మ‌న‌ల్ని!అస‌లు బ‌హిరంగ ధూమ పానం అన్న‌ది చ‌ట్ట వ్య‌తిరేకం అని చెప్పినా దానిపై వాదించే వాళ్లే కానీ పాటించేవాళ్లు ఎంత‌మందని? వీటిపై చ‌ట్టాలున్నాయి కానీ అమ‌లు లేదు..

పొగాకు పొగ‌ను ఒంటి నిండా నింపుకుని జీవితాల‌ను అర్ధంత‌రంగా ముగించేయ‌డం అన్న‌ది కాలుతున్న క‌ట్టె సాక్షిగా జ‌రుగుత‌న్న ప‌ని! రేప‌టి వేళ జ‌ర‌గ‌బోయే ప‌రిణామం కూడా! అయినా మ‌న జీవితాలు ఇలానేiga ఉంటాయి.ఇంత‌కుమించి అధ్వానంగా ఉన్నా కూడా మ‌నం భ‌రించాలి. చుట్టూ ఉన్న వారిలో ఏ మార్పూ తీసుకురాలేన‌ప్పుడు మ‌నం చూడాల్సినంత, చెందాల్సినంత, స‌హించాల్సినంత స‌హించి,భ‌రించి,వీలున్నంత విభేదించి ముందుకుపోవ‌డ‌మే జీవితం ఇచ్చేట‌టువంటి సందేశం కావొచ్చు.కావాలి కూడా!

ఆరోగ్యానికి హానిక‌రం అన్న ప‌దం థియేట‌ర్లో వినిపిస్తుంది. ధైర్యం తెచ్చుకుని చూస్తే కానీ ముఖేష్ యాడ్ ను మ‌నం త‌ట్టుకోలేం. మ‌రి! ఏటా ఎంద‌రికో క్యాన్సర్ కార‌కం అవుతున్న ధూమ‌పానం అన్న మాట‌ను మ‌నం ఏ విధంగా నిషేధిస్తున్నాం.మాటను కాదు చేత‌ను ఏ విధంగా నిషేధిస్తున్నాం.ఆధునిక జీవితంలో ఎవ‌రు ఏ ప‌ని అయినా చేయొచ్చు. ఎవ‌రు ఏ అల‌వాటు అయినా చేసుకోవచ్చు.ఆ విధంగా మన జీవితాలు అర్థం లేని విధంగా ఉన్నాయి.వెరీ మీనింగ్ లెస్ మేన‌ర్ లో ఉన్నాయి.క‌నుక ధూమ‌పానం బేబ‌మ్మ చేయ‌కూడ‌దు. అలా చెప్ప‌డం స‌బ‌బేనా!

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి,శ్రీ‌కాకుళం దారుల నుంచి…

– వైర‌ల్ ఎటాక్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version