VIRAL : రామ్ చ‌ర‌ణ్‌ను ఎన్టీఆర్ ఎందుకు కొడుతుండు.. విల‌విల ఏడ్చిన బుడ్డోడు : వీడియో వైర‌ల్

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుద‌ల అయిన విషయం తెలిసిందే. భారీ అంచ‌నాలతో విడుద‌ల అయిన ఈ సినిమా.. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తుంది. విడుద‌ల అయిన మొద‌టి రోజే ఏకంగా రూ. 223 కోట్లను రాబ‌ట్టింది. అయితే ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఉండ‌టంతో ప్ర‌త్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇద్ధ‌రు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సినిమా చూసిన ఒక బుడ్డోడు మాత్రం విలవిల ఏడుస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ధ్య జ‌రిగ‌న ఫైట్ ను చూసి.. ”మమ్మీ రామ్ చ‌ర‌ణ్ ను ఎన్టీఆర్ ఎందుకు కొడుతుండు… రామ్ చ‌ర‌ణ్ ను విల‌న్ చేశారా..” అంటూ గుక్క తిప్ప‌కుండా ఏడుస్తున్నాడు. త‌ల ప‌ట్టుకుని ”రామ్ చ‌ర‌ణ్ ఎమీ అన‌కున్నా.. కొడుతున్నారు” అంటూ ఏడుస్తున్నారు.

దీంతో ఆ బుడ్డోడి త‌ల్లి దండ్రులు రామ్ చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ హీరోలే అని న‌చ్చజెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.

Read more RELATED
Recommended to you

Latest news