విశాల్ ‘టెంపర్’ మొదలుపెట్టాడు

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా టెంపర్. వక్కతం వంశీ కథ అందించిన ఆ సినిమా ఎన్.టి.ఆర్ కెరియర్ నే మలుపు తిప్పింది. సినిమా కమర్షియల్ పర్వాలేదు అనిపించినా సినిమాల సెలక్షన్స్ లో ఎన్.టి.ఆర్ కు ఓ సరైన లెక్క వచ్చేలా చేసింది. ఇక ఆ సినిమా నుండి జై లవ కుశ వరకు హిట్లు కొడుతూనే ఉన్నాడు.

ఎన్.టి.ఆర్ కు కెరియర్ లో అంత ఇంపార్టెంట్ అయిన టెంపర్ సినిమా తమిళంలో రీమేక్ అవుతుంది. హిందిలో ఆల్రెడీ రన్వీర్ సింగ్ రీమేక్ చేస్తున్నాడు. కోలీవుడ్ లో విశాల్ ఆ సినిమా చేస్తున్నాడు. వెంకట్ మోహన్ డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈరోజు మొదలుపెట్టారు. విజయ్ సరసన రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు తమిళంలో అయోగ్య అని టైటిల్ పెట్టారు. ఈమధ్య విశాల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. ఈ లెక్కన చూస్తే తెలుగులో ఆల్రెడీ టెంపర్ హిట్ కాబట్టి ఈ అయొగ్య కూడా సూపర్ హిట్ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version