నేను కమిటెడ్ ప్రొఫెషనల్ యాక్టర్ ను అంటూ సీనియర్ యాక్టర్ అర్జున్ కు విశ్వక్ కౌంటర్ ఇచ్చారు. రాజయోగం మూవీ టీజర్ లాంచ్ కు ముఖ్య అతిథిగా విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్ ఆరోపణల పై నటుడు విశ్వక్ సేన్ స్పందించారు.
జరిగిన అలజడికి రెండు మూడు రోజులు హిమాలయాలకు వెళ్దాం అనుకున్నానని.. నేను ప్రతి సినిమా నీ నాది అనుకొని చేశానని వెల్లడించారు. సినిమాకీ నా అంత కమిటెడ్ ఎవరు ఉండరని.. నా వల్ల ఎవరు నిర్మాతలు డబ్బులు పోగొట్టు కోలేదని పేర్కొన్నారు.
నేను ఆ సినిమాకు నా వంతు ఎఫార్ట్ పెట్టీ చేద్దాము అనుకున్నానని… నేను సినిమా చెయ్యను అని చెప్పలేదని వెల్లడించారు. నేను లేటుగా రియలైజ్ అయ్యానని.. వాళ్ల మేనేజర్ రెండు రోజుల తరువాత మాకు కాల్ చేసి రెమ్యునరేషన్ వెనక్కి పంపించమని చెప్పాడన్నారు. సెట్ మీద దిస్కర్షన్ రావద్దు అని రెండు రోజులు మాట్లాడుకొని వెళ్దాము అని చెప్పానని.. సెట్ లో కంఫర్ట్ లేకుండా చేయలేనని స్పష్టం చేశారు. నా పరిస్తితి నీ మీకు చెప్పాను తప్పా.. రైటా అనేది మీరే చెప్పండని పేర్కొన్నారు విశ్వక్.