‘కల్కి’ విడుదల నేపథ్యంలో మేకర్స్ కీలక పోస్టు

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకువచ్చింది. అభిమానులతో పాటు సినీప్రియులు విజువల్స్‌కు ఫిదా అవుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పోస్ట్‌ పెట్టింది.

‘ఈ చిత్రం 4 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. దీనికోసం నాగ్‌అశ్విన్‌తో పాటు చిత్రబృందమంతా ఎంతో కృషి చేసింది. గ్లోబల్‌ స్థాయిలో దీన్ని తెరకెక్కించడం కోసం ఎంతో కష్టపడ్డారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎంతోమంది చెమటను రక్తంగా చిందించి దీన్ని రూపొందించారు. సినిమాను, క్రాఫ్ట్‌ను గౌరవిద్దాం. సినిమా చూసేవాళ్లు సన్నివేశాలను పోస్ట్‌ చేయొద్దు. నిమిషానికి ఒక అప్‌డేట్‌ను పంచుకోవద్దు. పైరసీని ప్రోత్సహించొద్దు. మూవీకి వచ్చే ప్రేక్షకుల ఆసక్తిని తగ్గించొద్దని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. సినిమా కంటెంట్‌ను కాపాడుకోవడానికి చేతులు కలుపుదాం. విజయాన్ని కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని ఈ పోస్టులో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news