మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ” వాల్తేరు వీరయ్య “

-

మెగాస్టార్​ చిరంజీవి చేస్తున్న లెటేస్ట్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాల్లో పాటలు అదిరిపోయే రేంజిలో హిట్టయ్యాయి.

ఈ నేపథ్యంలో, ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఇది ఫ్యాన్స్​కు పూనకాలు తెచ్చేలా ఉంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి  ” క్లబ్బులోన పార్టీ అంటే షరా షరా మామూలే” అంటూ సాగే ఈ పాటని విడుదల చేశారు. నకాష్ ఆజాజ్ – హరిప్రియ ఈ పాటను ఆలపించారు. చిరంజీవి మోడ్రన్ ముఠామేస్త్రి సినిమా తరహాలో లుంగీ పైకి కట్టి ఈ సాంగ్ లో స్టెప్పులు వేశారు. ఇక శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news