ఎన్టీఆర్ తో నటించాలని ఉంది..సీనియర్ హీరోయిన్ రాధిక

-

అవకాశం వస్తే ఎన్టీఆర్ తో నటించాలని ఉందని అన్నారు సీనియర్ హీరోయిన్ రాధిక.సూపర్ హిట్ “కిళక్కే పోగుం రైల్ ” (1978) మూవీతో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాధిక సూపర్ హిట్” న్యాయం కావాలి” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్టర్ రాధిక రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, అమితాబ్, జితేంద్ర, విష్ణువర్ధన్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి పలు మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు.

నిర్మాత, దర్శకురాలిగా పలు టీవీ సీరియల్స్ ను రాధిక నిర్మించి నటించారు.తాజాగా రాధిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్” మూవీ చూశానని తారక్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని..తారక్ తనకు ఇష్టమైన నటుడని నా పేరు నచ్చి మాగ్రాండ్ సన్ కు తారక్ అనే పేరు పెట్టామని, తారక్ మంచి నటుడే కాదు డాన్సర్ కూడా అంటూ తారక్ ను ప్రశంసించారు.తారక్ తో నటించాలనే కల ఉందని, ఏ పాత్ర అయినా సరే నటించాలి అంతే అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news