త్రివిక్రమ్ తో రామోజీరావు కి యుద్ధం ?

-

తెలుగు దిన పత్రిక అంటే గుర్తుకు వచ్చేది ఈనాడు. రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు కి గెజిటెడ్ పత్రికగా ఈనాడు గురించి మాట్లాడతారు ప్రత్యర్థి పార్టీల నేతలు. అటువంటి ఈనాడు పత్రికలో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమాకి సరైన కవరేజ్ కావాలని చేయటం లేదని ఇండస్ట్రీలోని మరియు ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి.

Image result for trivikram ramoji rao"

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సినిమాకి సంబంధించి సక్సెస్ సంబరాలు అనేక విషయాలు అన్ని పత్రికలు కవర్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈనాడు పత్రిక మాత్రం ఎక్కడా కూడా త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి కవరింగ్ కావాలని ఇవ్వటం లేదని వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా ఈ సినిమాని తక్కువ చేస్తూ సంక్రాంతికి వచ్చిన మరొక సినిమాకి ఈనాడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మరియు రామోజీరావు ల మధ్య ఏదో యుద్ధం జరుగుతుందని ఇండస్ట్రీలో వారు గుసగుసలాడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news