వ్యాయామం చేయకుండానే పొట్ట తగ్గాలా.. !

-

మన రోజువారి జీవనశైలిలో మార్పుల కారణంగా బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. హడావుడి జీవితం లో వ్యాయామం చేయడానికి టైమ్ ఉండటం లేదు. మరి ఇలాంటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజూవారి ఆహారం లో భాగం చేసుకోడం ద్వారా వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి.

బాదంపప్పు: మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.బాదం పప్పు తినడం వల్ల శరీరంలో నీరు పేరుకోకుండా ఉంటుంది.బాదంపప్పు నీటిలో నానబెట్టడం వల్ల ఈ తొక్క తేలిగ్గా వచ్చేస్తుంది. రోజూ బాదం పప్పు తినడం వల్ల వీటిలోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన రావడం వల్ల తేలిగ్గా బరువు తగ్గించుకోవచ్చు. నానబెట్టిన బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. వయసు మీద పడటం, వృద్ధాప్య ఛాయల నుంచి ఇది కాపాడుతుంది. ఇందులో విటమిన్ బి7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌తో పోరాడతాయి.

కోడిగుడ్డు: మాంసకృత్తులు అధికంగా అందించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్లసొన తీసుకోవడం వల్ల బి12, డి విటమిన్లు, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అధికంగా అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్రపోషిస్తాయి. దీనివల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. గుండె పని తీరు కూడా మెరుగవుతుంది.

పండ్లు: ఆకలిగా అనిపించినప్పుడు స్వీట్స్ లేదా జంక్ ఫుడ్ తినే బదులు పండ్లు ప్రత్యామ్నయంగా ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వూ అందుతాయన్న బాధ ఉండదు. పోషకాలూ ఎక్కువగా అందుతాయి. బరువూ సులభం గా తగ్గుతారు.

ఓట్స్‌: ఉదయం పూట నూనెతో చేసిన ఉప్మా, దోశ,వడ లాంటి బరువు పెరిగే టిఫిన్స్ కి బదులు ఓట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవక్రియల రేటు వృద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనిలోని పీచు కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులు ఏవైనా తాజా పండ్ల ముక్కలూ, రసాలు కలిపితే సహజ చక్కెర్లు అందుతాయి. పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news