హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి.. ఫొటోస్ వైరల్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలోకి విలన్ గా అడుగుపెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తన రూటు మార్చుకొని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడని చెప్పాలి. ఎక్కువగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్.. తోటి నటీమణి ఊహను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రోషన్ సినిమాలలో బిజీగా ఉండగా, చిన్న కొడుకు రోహన్ కూతురు మేధ ఇంకా చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో శ్రీకాంత్ స్వయానా తమ్ముడు అనిల్ మేక కూతురు పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. హీరో శ్రీకాంత్ తన తమ్ముడి కూతురు పెళ్లికి సతీ సమేతంగా హాజరైనట్లు ఆ ఫోటోల ద్వారా తెలుస్తోంది.

ఇకపోతే ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారడమే కాదు త్వరలోనే మేధా పెళ్లి కూడా చూడాలి అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది లేదు ఆమెను హీరోయిన్గా చూడాలని కామెంట్లు చేస్తున్నారు.. ఇకపోతే హీరో శ్రీకాంత్ తమ్ముడు అనిల్ మేక విషయానికి వస్తే.. 1999లో వచ్చిన.. ప్రేమించేది ఎందుకమ్మా అనే రొమాంటిక్ చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఆయన మళ్ళీ హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. దాంతో నిర్మాతగా మారి 2 , 3 చిత్రాలకు పనిచేసి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఈయన కూతురి పెళ్లి ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version