వామ్మో.. సింగర్ మంగ్లీ రేంజ్ మామూలుగా లేదుగా..?

-

ఫోక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ గురించీ.. ఆమె గొంతు గురించీ..గాత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మైకు పట్టి గళం విప్పిందంటే చాలు చిన్న,పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పరవశించిపోతారు. ముఖ్యంగా పరమశివుడి పాటలు ఈమె నోటి నుంచి ముత్యాలలా జారి పడుతూ ఉంటాయి. అంత అద్భుతంగా తన పాటలతో అందరిని ఆకట్టుకుంది మంగ్లీ. ప్రస్తుతం వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ఏర్పరచుకున్న ఈమె ఐటమ్ సాంగ్ అయినా భక్తి పాట అయినా తనదైన శైలిలో పాడి తన మార్కేంటో చూపిస్తూ ఉంటుంది.

మరో విశేషం ఏమిటంటే మంగ్లీ పాడిన పాటలు అన్నీ కూడా మంచి సూపర్ హిట్గా నిలవడంతో ఈమెకు మరింత గుర్తింపు వచ్చింది. మొదట న్యూస్ యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన మంగ్లీ ఆ తర్వాత సింగర్ గా మారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఫీమేల్ సింగర్ అనిపించుకుంటుంది. బతుకమ్మ పాటలతో బాగా ఫేమస్ అయిన ఈమె సినిమాలలో కూడా పాటలు పాడే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సింగర్ మంగ్లీ పారితోషకానికి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక్కో పాటకు కేవలం రూ.20,000 మాత్రమే తీసుకున్న మంగ్లీ ఇప్పుడు తన రేంజ్ పెరగడంతో ఒక్కో పాటకు రూ.4 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమా హిట్ అవడం వెనుక మంగ్లీ పాటలు కూడా కీలకంగా నిలుస్తూ ఉంటాయి. అందుకే ఈమె అడిగినంత ఇవ్వడానికి నిర్మూతలు కూడా వెనుకడుగు వేయడం లేదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news