Big Boss OTT Telugu: వాటీజ్ ‘బిగ్ బాస్’ ప్లాన్..అషురెడ్డి కొనసాగింపేనా?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయింది. ప్రజెంట్ హౌజ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ బాబా భాస్కర్ తో కలుపుకుని 11 మంది కంటెస్టెంట్స ఉన్నారు. మరో నాలుగు వారాల్లో గేమ్ క్లోజ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో గేమ్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

గత వారం లాగే ఈసారీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నారు. బీబీ లవర్స్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరోనని చర్చించుకుంటున్నారు. కాగా, ‘బిగ్ బాస్’ ప్రతీ సారి అషురెడ్డిని సేవ్ చేయాలని చూస్తున్నాడా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు బీబీ లవర్స్, రివ్యుయర్స్.

అషురెడ్డి కంటే మంచిగా గేమ్ ఆడే వాళ్లు ఉన్నప్పటికీ ‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున..అషురెడ్డి గేమ్ సూపర్ అనడంపైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు అషురెడ్డి ఇటీవల కాలంలో అసభ్య పద జాలం ఉపయోగిస్తుండటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిందు మాధవిని ఉద్దేశించి..ఆమె మాట్లాడుతూ..బిందు అఖిల్ సెంటర్ లో *** అని అంది. ఈ విషయమై ‘బిగ్ బాస్’ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని అడుగుతున్నారు. చూడాలి మరి.. ‘బిగ్ బాస్’ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారో..

 

Read more RELATED
Recommended to you

Latest news