ఈ అనుమతులేంటి ..ఇలా అయితే సగానికి సగం సినిమాలు మొదలవవుగా ..?

-

లాక్ డౌన్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ తో పాటు టీవీ షూటింగ్స్ ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలు నెమ్మదిగా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ కి, కంపెనీస్ కి కరోనా నిబంధనలతో పనులు ప్రాంభించుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. జోన్ ల వారిగా కొన్ని సడలింపులని ఇస్తూ పనులు సాగించుకోవమని చెప్పిన ప్రభూత్వాలు చిత్ర పరిశ్రమకి మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

 

ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమకి అనుమతులు కోరుతు షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. దాంతో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఖచ్చితంగా కరోనా నిభంధనలు పాటిస్తూ వీలైనంత తక్కువ యూనిట్ సభ్యులతో సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కి అలాగే పోస్ట్ ప్రొడక్షన్స్ జరుకునేందుకు సానుకూలంగా స్పందిస్తూ అనుమతులిచ్చారు. అయితే కొంతమంది మేకర్స్ కి షాక్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఇప్పటి వరకు సగానికి పైగా షూటింగ్ పూర్తయిన సినిమాలు మాత్రమే మొదలు పెట్టుకోవాలని నిబంధన పెట్టారట.

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’.. దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’.. ప్రభాస్ – రాధాకృష్ణ కాంబోలో సినిమా.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’.. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’.. అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ లాంటి సినిమాలు ఇప్పటికే సగభాగం అలాగే దాదాపు షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు షూటింగ్స్ అనుమతి ఇవ్వడంతో ఈ సినిమాలు మాత్రమే చిత్రీకరణ మొదలు పెట్టుకునే అవకాశాలున్నాయి. బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో మొదలైన ‘పుష్ప’.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. బాలయ్య – బోయపాటి శ్రీను సినిమా.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదలవ్వాల్సిన సినిమాలు ఇప్పట్లో షూటింగ్స్ కి వెల్లడం కష్టం అని దీంతో అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news