రాష్ట్రప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు నిబద్ధత ఉండదా? ప్రజాప్రయోజనం వాటిలో కనిపించదా? కేవలం స్వలాభం కోసమే నిర్ణయాలు ఉంటాయా? ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది! ఎందు కంటే.. ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ.. న్యాయసమీక్షలో నిలబడడం లేదు. దాదాపు ఇప్పటికి 64 కేసుల్లో ఒక్కటి ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. కార్యాలయాలకు రంగుల విషయం పక్కన పెడితే.. పేదలకు ఇంగ్లీషు చదువులు అందాలన్న బృహత్ సంకల్పాన్ని కూడా కోర్టులు కొట్టేశాయి.
అంతేకాదు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న నిర్ణయం కూడా తమ కనుసన్నల్లోనే సాగాలని హుకుం జారీ చేశాయి. ఇక, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివేవారికి ఎంతో కొంత ఊరటినిస్తూ.. ఫీజులు తగ్గించాలన్న నిర్ణయాన్ని కూడాకోర్టులు కొట్టేశాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. పాఠశాలల్లో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు.. చెప్పేది తక్కువ.. రాబట్టేది ఎక్కువగా ఉందంటూ.. ప్రజలు గగ్గోలు పెట్టడంతో ఆయా ఫీజులను నియంత్రించేందుకు జగన్ ప్రభుత్వం వేసిన అడుగులను కూడా తాజాగా హైకోర్టు సస్పెండ్ చేసింది.
అంతేకాదు.. ప్రభుత్వం అప్పులు తేవాలన్నా.. భూములు విక్రయించాలన్నా.. ఇలా ఏ నిర్ణయంపైనైనా.. అన్నీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వ్యతిరేకత వస్తోంది. అలాగని న్యాయవ్యవస్థ ఉన్నతిని ఎవరూ తప్పుపట్టజాలరు. పోనీ.. ఈ పరిస్థితి ఒక్క ఏపీకే ఉందా? అంటే అలా లేదు. పొరుగునే ఉన్న తెలంగాణలోనూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టు కొట్టేస్తోంది. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయించిందో చూస్తేనే ఉన్నాం. దీంతో ఏకం గా అక్కడ పదోతరగతి పరీక్షలనే రద్దు చేసేశారు.
శవాలకు కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించింది. ఇలా న్యాయవ్యవస్థతనపని తాను చేస్తోంది. కానీ, చిత్రమైన విషయం ఏంటంటే.. ఒక్క బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఇలాంటి వివాదాలు తెరమీదికి వస్తున్నాయని .. జాతీయ మీడియా వెల్లడించింది! మరి ఇలా ఎందుకు జరుగుతోందో?? ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు పాలించడం రాదని అనుకోవాలా?! ఏమో పైనున్నవారికే తెలియాలి!!