ఏంటి.. రామ్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

-

చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎనర్జిటిక్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గత ఏడాది ది వారియర్ సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా గత ఏడాది రామ్ పెళ్లి న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.

రామ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని.. అయితే రహస్యంగా వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తన చిన్ననాటి స్నేహితురాలిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు రకరకాల కథనాలు వెలువడ్డాయి అయితే ఈ వార్తలపై అప్పట్లో రామ్ స్పందించి తనదైన రీతిలో రూమర్లకు చెక్ పెట్టాడు . అంతేకాదు అమ్మాయి ఎవరో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను.. మా ఇంట్లో వాళ్ళు ఈ వార్తలు విని నిజంగానే నేను పెళ్లి చేసుకోబోతున్నానని అనుకుంటున్నారు. అలాంటి అమ్మాయి ఎవరు లేరని కూడా తెలిపాడు . దాంతో అప్పటివరకు ఆ వార్తలకు పులిస్టాప్ పడింది.

కానీ ఇప్పుడు మళ్లీ రామ్ చేసిన తీరుకు..అప్పుడే పెళ్లయిపోయి.. ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి రామ్ ఈరోజు సన్ డే సందర్భంగా సిద్ధాంత పోతినేని అని పెట్టుకొచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఒక చిన్న పిల్లాడితో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో షేర్ చేస్తూ ఇలా రాసుకు రావడంతో ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఏంటి రామ్ కి పెళ్లయి.. ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? పెళ్లెప్పుడు జరిగింది? సీక్రెట్ గా ఎందుకు వివాహం చేసుకున్నాడు? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఆ పిల్లవాడు రామ్ కొడుకు కాదు.. వాళ్ళ అన్న కొడుకు. సమయం దొరికినప్పుడల్లా రామ్ తన అన్నయ్య కొడుకుతో ఇలా ఆడుతూ కనిపిస్తాడు. మొత్తానికైతే ఈ ఏడాదిలో అయినా రామ్ పెళ్లి శుభవార్త చెబుతాడని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news