23న ప్రభాస్ సర్ ప్రైజ్..!

-

అక్టోబర్ 23 అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే.. ఆరోజు ప్రభాస్ పుట్టినరోజు. ప్రతి బర్త్ డేకు తన ఫ్యాన్స్ కు చేస్తున్న సినిమా నుండి సర్ ప్రైజ్ ఏర్పాటు చేసే ప్రభాస్ ఈసారి కూడా సాహో నుండి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నారు. అయితే ఈ బర్త్ డేను మరింత స్పెషల్ గా మార్చేలా తన మ్యారేజ్ న్యూస్ రివీల్ చేస్తాడని అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్.

ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. ఆమే పేరు ఇలాంటి విషయాలు చెబుతాడా అనేది చెప్పలేం కాని పెళ్లిపై ప్రభాస్ ఓ ఫైనల్ డెశిషన్ చెప్పేస్తాడని తెలుస్తుంది. సాహో షూటింగ్ ఇరాక్ లో జరుగుతుంటే అనుష్క అక్కడకు వెళ్లడంతో మళ్లీ ప్రభాస్, అనుష్కల పెళ్లి అని వార్తలు వస్తున్నాయి. వారిద్దరి ఇదవరకే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

మరి 23న ప్రభాస్ చేయబోయే ఎనౌన్స్ మెంట్ ఏంటి అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇక కొందరేమో ప్రభాస్ తన తర్వాత సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అక్టోబర్ 23 మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు వెరీ స్పెషల్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news