కొత్త సినిమా గురూ : కమల్ సినిమా విడుద‌ల ఎప్పుడంటే ?

-

అత్యంత భారీ అంచనాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్”.కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ట్రైల‌ర్ తోనే అంచనాలు పెంచింది. ఈ నేప‌థ్యంలో అన్ని కార్య‌క్ర‌మాల‌నూ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మౌతోంది.జూన్ మూడున మా చిత్రం విక్ర‌మ్..ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంద‌ని,ఆ రోజు కోసం తానూ ఆతృత‌గానే ఎదురు చూస్తున్నాన‌ని హీరో క‌మ‌ల్ వెల్ల‌డించారు. విజయ్ సేతుపతి ప్ర‌ధాన ప్ర‌తినాయ‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

మ‌రో వినూత్న న‌టులు,ద‌ర్శ‌కులు ఫహాద్ ఫాజిల్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్.మహేంద్రన్ తో  కలిసి క‌మ‌ల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.విక్రమ్ చిత్రంకు సంబంధించిన సాంకేతిక బృందంలో కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ , ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ త‌దిత‌ర కీల‌క వ్య‌క్తులు ఉన్నారు.

సోర్స్ : –  సినీ వినోదం ఫేం రాంబాబు

Read more RELATED
Recommended to you

Latest news