లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ ఎవరంటే..

-

భాష ఏదైనా విడుదలైన సినిమాలో హీరో మాత్రం ముఖ్యమే చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో హీరోలనే ఆదిపత్యం అనటంలో ఎలాంటి సందేహం లేదు హీరో పేరు చూసి సినిమాకు వచ్చే అభిమానులు ఎంతోమంది ఆ హీరో స్టేటస్ ని చూసి సినిమా బడ్జెట్ కూడా డిసైడ్ అయిపోతుంది అలాగే మొత్తం సినిమా స్టేటస్ మారిపోవాలి అంటే హీరో ను బట్టి ఉంటుంది అయితే అతి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే హీరోతో సంబంధం లేకుండా తమ సినిమాలకు స్టార్ స్టేటస్ తీసుకురాగలుగుతున్నారు. అలాగే తాము చేసిన సినిమాలు మంచి హిట్ అయ్యేటట్టు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు మరి ఈ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం..

ఇప్పటివరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలో చాలామంది హీరోయిన్స్ చేశారు అయితే అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అనుష్క శెట్టి.. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క లేడీ అంటే సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది అందులో ముఖ్యంగా అరుంధతి ఒకటి ఈ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.. ఆమె హీరోలు పోషించిన భాగమతి చిత్రం కూడా మంచి పేరు సంపాదించుకుంది అలాగే మరో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది.. ఈమె ప్రధాన పాత్రను నటించిన అనామిక చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.. అలాగే త్వరలోనే కనెక్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

అలాగే హీరోయిన్ సమంత కూడా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది ఇందులో మంచి సక్సెస్ అందుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి తాజాగా ఆమె నటించిన యశోద చిత్రం కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది అలాగే ఓ బేబీ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.. అలాగే అనుపమ పరమేశ్వర కీర్తి సురేష్ సైతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..

Read more RELATED
Recommended to you

Latest news