అసలు మహేష్ సినిమా ఎవరితో…?

-

మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమా కోసం అందరి హీరోల అభిమానులు ఎదురు చూడటంతో సినిమాకు హైప్ ఎక్కువగానే క్రియేట్ అవుతుంది అనేది వాస్తవం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా ఎవరితో ఉంటుంది అనేది స్పష్టత రావడం లేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నారు. నలుగురు దర్శకులు వినిపించే కథలను మహేష్ వింటున్నా… ఏ కథను ఫైనల్ చేసే అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి. వంశీ పైడపల్లి తో మహేష్ బాబు సినిమా చేస్తారని అన్నారు. కాని ఆ సినిమా కథ మీద మహేష్ అంతగా ఆసక్తి చూపించలేదు.

ఆ తర్వాత గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తో ఓ సినిమా అన్నారు. అదీ ముందుకు పోవడం లేదు. ఆ మధ్య ప్రవీణ్ సత్తారుతో కూడా మహేష్ చర్చలు జరిపారని అన్నారు. అది కూడా ఫైనల్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వెంకీ కుడుముల తో సినిమా అంటున్నారు. ఈ సినిమా కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సెట్స్ మీదకు మహేష్ సినిమా వెళ్ళే సరికి ఏ ఆరు నెలలో పడుతుంది. అంటే వచ్చే ఏడాది మహేష్ సినిమా లేనట్లే.

Read more RELATED
Recommended to you

Latest news