వర్మ సంచలన ట్వీట్… చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

-

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ భిన్న మైన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. ఆయన ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు తన అనుభవాలను తన పోస్ట్ ల ద్వారా పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ‘శివ’ చిత్రం నుంచి ఒక ఫోటో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ‘శివ’ చిత్రం అటు కింగ్ నాగార్జున కు అలానే దర్శకుడు వర్మ కు మంచి హిట్ బ్రేక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగ్ సినీ కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా చెప్పుకోవాలి అంటే శివ చిత్రం పేరే చెబుతారు. అలాంటి మంచి హిట్ ఇచ్చిన వర్మ ఆ తరువాత సంచలనాల దర్శకుడు గా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎప్పటికప్పుడు తన అనుభవాలను సోషల్ మీడియా లో పంచుకొనే వర్మ శివ చిత్రం నుంచో ఒక ఫోటో పోస్ట్ చేయడం తో నెటిజన్లు షాక్ కు గురయ్యారు. దానికి కారణం ఆ ఫోటోలో నాగ్ వెనుక ఉన్న వ్యక్తి గురించి వర్మ చెప్పడం తో యూజర్లు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ వర్మ ట్వీట్ చేసిన ఆ ఫోటో లో నాగ్ వెనుక ఉంది ఎవరో తెలుసా ఆయనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.

‘శివ షూటింగ్‌లో నాగార్జున, ఇస్మార్ట్ పూరీ జగన్’ అంటూ వర్మ ఆ ఫోటోను ట్వీట్ చేయడం తో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. వర్మ ట్వీట్ పై స్పందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘మీ దయ వల్లే’ అంటూ రీట్వీట్ చేశాడు. అయితే ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో నెటిజన్లు కూడా తమదైన శైలి లో కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే ఆకాశ్ పూరి ఇప్పుడు ఎలా ఉన్నాడో నాడు పూరీ కూడా అలాగే ఉన్నాడు’ అంటూ కామెంట్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news