అలాంటి రికార్డు సృష్టించిన ఏకైక తెలుగు హీరో ఎవరంటే..!

-

తాజాగా 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందులో బెస్ట్ యాక్టర్ అవార్డు విభాగంలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకొని తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు. అయితే ఇంతకంటే ముందే అక్కినేని నాగార్జున కూడా రెండు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు సినీ ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది. 1997లో నిన్నే పెళ్ళాడుతా సినిమాకి గాను నాగార్జున నిర్మాతగా నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. ఇక బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలుగు కేటగిరీలో నిన్నే పెళ్లాడతా సినిమాకి నేషనల్ అవార్డు లభించింది.

ఇక ఆ తర్వాత ఏడాది 1998లో అన్నమయ్య సినిమాకి గాను స్పెషల్ మెన్షన్ లిస్టులో నేషనల్ అవార్డు దక్కించుకున్నారు నాగార్జున. ఈ విధంగా రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రప్పించారు. ఇక నేషనల్ అవార్డ్స్ మాత్రమే కాదు 8 నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. నిన్నే పెళ్ళాడతా , ప్రేమ కథ , అన్నమయ్య, సంతోషం, యువకుడు, రాజన్న ,శ్రీరామదాసు, మన్మధుడు వంటి సినిమాలకు గాను నాగార్జున వరుసగా నంది అవార్డులను దర్శించుకున్నారు. శ్రీరామదాసు, అన్నమయ్య, సంతోషం సినిమాలకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డును దక్కించుకోగా మిగిలిన సినిమాలకు ప్రొడ్యూసర్ గా, స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డులు దక్కించుకున్నారు.

ఇవే కాకుండా ఒక ఐఫా అవార్డు, మూడు సైమా అవార్డులు కూడా ఈయనకు లభించాయి. ఇక ఫిలింఫేర్, స్టార్ మా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వరుసగా అన్ని అవార్డులపై ఒక చేయి వేశారు నాగార్జున. ఏది ఏమైనా ఇలా వరుసగా అటు నటుడిగా, ఇటు ప్రొడ్యూసర్ గా కూడా అవార్డులు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించారు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news