పూరి జగన్నాధ్ అల్లరి నరేష్ కోరిక తీరుస్తారా …?

-

టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ పంథా పూర్తిగా వేరేగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తను అనుకున్నదే తీస్తారు. అనవసరమైన సీన్స్ అంటూ ఏవీ లేకుండానే హిట్ కొడతారు. హీరోలకి ఒక ఎనర్జీ తీసుకు రావడం లో పూరి స్టైల్ మిగతా దర్శకులందరి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే పూరి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని కూడా ఆలోచించకుండా కొంత కాలం ఆయన సినిమాకి కమిటయ్యారు. ఇక బాలకృష్ణ లాంటి అగ్ర నటుడు కూడా నీ సినిమాలు చూశాను మళ్ళీ కథ చెప్పనవసరం లేదు డైరెక్ట్ గా షుటింగ్ కి వెళ్ళిపోదాం అన్నారంటే పూరి జగన్నాధ్ అంటే ఎంత నమ్మకమో అర్థమవుతుంది.

 

అయితే ఇప్పుడు పూరి జగనాధ్ సినిమాలో అవకాశం వస్తే నటించాలని టాలీవుడ్ లో ప్రతీ ఒక హీరో అనుకుంటున్నాడు. అతనే అల్లరి నరేష్. రవిబాబు దర్శకత్వంలో అల్లరి సినిమాతో పరిచయమైన ఈ ఈ వి వి వారబ్బాయి ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోగా మంచి ఫేమస్ అయ్యాడు. వాస్తవంగా అల్లరి సినిమా చూసినపుడు ఎవరూ నరేష్ ఇంత పెద్ద హీరో అవుతాడని ఊహించలేదు. కాని ఏకంగా జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అనిపించుకున్నాడంటే చాలా గొప్ప విషయం.

ఇక టాలీవుడ్ లో ఆ తరం కామెడీ హీరోలలో రాజేంద్ర ప్రసాద్ ఎలాగో ఈ తరం కామెడీ హీరోల్లో నరేష్ అలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీకొచ్చిన చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఇక గమ్యం, శంభో శివ శంభో, మహర్షి సినిమాలలో మంచి సపోర్టింగ్ రోల్స్ లోను నటించి టాలీవుడ్ మేకర్స్ కి ఒక ఆప్షన్ గా ఉన్నాడు. అయితే అలా ఒక ముఖ్య పాత్ర వస్తే పూ జగన్నాధ్ సినిమాలో నటించాలని ఆశపడుతున్నాడు అల్లరి నరేష్. అయితే పూరి జగన్నాధ్ ఇలాంటి వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారన్న పేరు ఉంది. నెక్స్ట్ సినిమాలో అల్లరి నరేష్ కి ఏదైనా పాత్ర రాస్తారా… అల్లరి నరేష్ కోరిక తీరుతుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news