రోజాని టార్గెట్ చేసింది ఎవరు…?

-

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మంచి కార్యక్రమం చేసినా సరే ఆమె… మాత్రం ఇప్పుడు బుక్ అయిపోయారు. దీనిపై ఆమె తెలుగుదేశం మీద విమర్శలు చేసినా సరే తనకు కూడా అనవసరంగా ఇరుక్కుపోయాను అనే భావన ఉంది అనేది రాజకీయ పరిశీలకుల మాట. మంచి నీళ్ళ సమస్యను తీర్చి, పువ్వులు జల్లి౦చుకోవడం అది కూడా కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న సమయంలో…

దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏదైనా చేస్తే సైలెంట్ గా చేసి మీడియా కు సమాచారం ఇవ్వాలి గాని ఇలా చేయడం ఎంత వరకు సమంజసం అనేది అర్ధం కాని పరిస్థితి. ఇక ఇప్పుడు ఆమెను సొంత జిల్లాలోనే కొందరు టార్గెట్ చేసారని సమాచారం. ఒక మంత్రి గారు ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డు పడ్డారు అనేది కూడా రోజా భావన.

వాస్తవానికి ఆమె చేసిన కార్యక్రమానికి షూట్ చేయడానికి గానూ ఎవరూ తెలుగుదేశం గాని జనసేన గాని బిజెపి గాని వెళ్ళలేదు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులే స్వయంగా వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో ఆమెను పొగుడుతూనే చేసారు. దీని వెనుక ఒక మంత్రిగారి హస్తం ఉంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సదరు మంత్రి గారికి రోజా గారికి మధ్య గత కొంత కాలంగా పడటం లేదు.

రోజా జిల్లాలో కాస్త దూకుడుగా ఉండటం కూడా సదరు మంత్రి గారు అసలు తట్టుకోలేక పోతున్నారని అంటున్నారు. అన్ని విధాలుగా ఆమెకు అర్హతలు ఉన్నా సరే మంత్రి పదవి మాత్రం రోజాకు రాలేదు. ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో అల్లరి చేసేలా చేసింది మాత్రం సొంత జిల్లాకు చెందిన మంత్రి గారే అనే విషయం ఆమెకు కూడా స్పష్టత ఉంది. ఆయన ఏమో జగన్ కి అత్యంత సన్నిహితుడు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news