రామ్ ఇస్మార్ట్ శంకర్ తో సాధించుకున్న క్రేజ్ నిలబడదా ..?

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రామ్ తో రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్ఠించిన సంగతి తెలిసందే. ఈ సినిమా రామ్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంతేకాదు 2019 లో రిలీజై భారీగా లాభాలను తీసుకొచ్చిన సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది. అందుకు కారణం ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడమే.

 

పూరీ జగన్నాథ్‌ ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ తర్వాత వరసగా వచ్చిన ఫ్లాప్స్ తో బాగా ఆర్ధికంగా నష్ఠాలల్లో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత ఏ సినిమా కూడా పూరి కి కనీసం పెట్టిన పెట్టుబడు కూడా తిరిగి రాలేదు. కాని ఇస్మార్ట్ శంకర్ మాత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా కొన్నేళ్ళుగా ఫ్లాప్స్ తో అవస్థలు పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కి తిరుగులేని సక్సస్ ని ఇచ్చింది. దాంతో ఈ ఇద్దరు మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ పేరుతో ఈ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టాలనుకున్నారు. కాని ఇద్దరు వేరే సినిమాలకి కమిటయ్యారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ రెడ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ సినిమాతో మరొసారి రామ్ ప్రేక్షకుల ముందుకు వద్దామనికున్నాడు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే మరో మాస్ బ్లాక్ బస్టర్ పక్కా అని అందరూ అనుకున్నారు. కాని కరోనా రామ్ కి గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులలో థియోటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యో అవకాశాలు లేవని అర్థమవుతుంది. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలేవి ఈ సంవత్సరం రిలీజ్ చేయకపోతే మంచిదన్న భానలో ఉన్నారు. దాంతో రామ్ చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన క్రేజ్ అండ్ మార్కెట్ దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version