ఈ సారైనా శేఖర్ కమ్ముల కల నెరవేరుతుందా..!

శేఖర్ కమ్ముల సినిమాలు వేసవిలో కొబ్బరి నీళ్లలా ఉంటాయి. ఆయన సినిమాల్లోని ప్రతి క్యారెక్టర్ మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. క్లాసిక్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలు తీశారు ఆయన. కానీ అవన్నీ మీడియం రేంజ్ హీరోలతోనే చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరున్నా.. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకు రాలేదు.

ఫిదా స్టోరీని మహేశ్ బాబుతో పాటు ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలకు వినిపించినా.. వారు కథను నమ్మలేదని స్వయంగా ఈ క్లాస్ డైరెక్టరే చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆవరేజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలలో ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడటంతో.. ఈ సారి ఎలాగైనా స్టార్ హీరోతో సినిమా చేయాలని ఓ కథను రాస్తున్నాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

ఈ సారి ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నానని ఆయనే ప్రకటించాడు. కానీ ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఆ హీరో కోసమే కథ రాస్తున్నాడని సమాచారం. కరోనా కారణంగా దొరికిన గ్యాప్ ను శేఖర్ బాగానే వినియోగించుకుంటున్నాడు. మరి ఈ సారైనా స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఈ క్లాస్ డైరెక్టర్ కు వస్తుందో లేదో చూడాలి.