వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ ఇద్దరిలో ఎవరితో ..?

-

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొత్త బంగారు లోకం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. బ్రహ్మోత్సవం చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాని కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ఇక వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ ఎఫ్2, వెంకీ మామ వంటి మాస్ హిట్స్ ని అందుకున్నాడు. దీంతో ఈసారి నారప్ప తో బ్లాక్ బస్టర్ అందుకొని హ్యాట్రిక్ హిట్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే నారప్ప చాలా వరకు టాకీ పార్ట్ జరుపుకుంది. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక లాక్ డౌన్ తర్వాత శరవేగంగా నారప్ప ని కంప్లీట్ చేయాలని వెంకీ ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు వెంకీ ఫ్యాన్స్ లోను ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అదే వెంకీ చేయబోయో నెక్స్ట్ సినిమా ఏది అని. ఇప్పటికే వెంకీ కోసం సూపర్ హిట్ కి సిరీస్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. దాదాపు వెంకీ నెక్స్ట్ సినిమా ఇదే కావచ్చు. అయితే ఇందులో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు కాబట్టి ఒకవేళ వరుణ్ డేట్స్ లేకపోతే మాత్ర వెంటనే పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ సినిమా ఉండబోతుందని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version