Big Boss OTT Telugu: వరస్ట్ ఇంటి సభ్యుడి ఎలిమినేషన్‌..బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్?

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ కీలకం కానుంది. ఇంకో నాలుగు వారాలు మాత్రమే గేమ్ ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ కంపల్సరీగా డబుల్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో వార్తొలొస్తున్నాయి. కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కు ఇప్పటికే సంకేతాలు హోస్ట్ నాగార్జునకు అందినట్లు టాక్.

ఈ వారం వరస్ట్ ఇంటి సభ్యుల నామినేషన్ ఆసక్తికరంగా సాగింది. శనివారం నాటి ఎపిసోడ్ లో
వరస్ట్ ఇంటి సభ్యులుగా కంటెస్టెంట్స్ ఓటింగ్ ప్రక్రియలో నామినేట్ చేశారు. మిత్రా శర్మ వరస్ట్ ఇంటి సభ్యురాలు అని శివ ఓటు వేశాడు. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్ కూడా మిత్రా శర్మ కు వరస్ట్ ఇంటి సభ్యురాలు అని ఓటేశాడు.

అలా వరుసగా ఓటింగ్స్ పడ్డాయి. దాంతో చివరకు మిత్రా శర్మనే వరస్ట్ ఇంటి సభ్యురాలు అయిపోయింది. అలా ఓ వైపున మిత్రా శర్మ జైలుకు వెళ్లడం జరగుతుండగా, మరో వైపున అఖిల్ కు కెప్టెన్సీ దక్కింది. అయితే, ఈ సారి జైలుకు వెళ్లే క్రమంలో తనకు ఎటువంటి రిగ్రెట్స్ లేవని మిత్రా శర్మ పేర్కొంది. అయితే, ఈ వారం ఎలిమినేషన్ చాన్స్ వరస్ట్ ఇంటి సభ్యురాలు అయిన మిత్రా శర్మనే అని సోషల్ మీడియాలో వార్తలొస్తు్న్నాయి. చూడాలి మరి..ఏం జరుగుతుందో.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఎటువంటి సంకేతాలు ఇస్తారు..ఎవరిని బయటకు పంపుతారు? అనేది చాలా ఆసక్తికరంగా మారింది.