సాయి పల్లవి.. ఈమెను ఎక్కువగా నిర్మాతల మనిషి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నిర్మాతలకు ఏమాత్రం నష్టం కలిగించకుండా ఇచ్చిన పారితోషకంలోనే అన్ని సర్దుకుంటూ నిర్మాతలకు ఫేవర్‌గా నిలుస్తూ ఉంటుంది. అందుకే ఈమెను తమ సినిమాలలో పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు కూడా తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ చేయడానికి వస్తే హీరోయిన్లకు లక్షలు లక్షలు నిర్మాతలు ఖర్చు చేయాలి.. కానీ సాయి పల్లవి వస్తే ఆ ఖర్చులు ఏవి నిర్మాతలు భరించాల్సిన అవసరం లేకుండా అన్ని స్వయంగా సాయి పల్లవి భరించడం గమనార్హం. అందుకే సాయి పల్లవికి మానవత్వం ఎక్కువ అంటూ చాలామంది పొగుడుతూ ఉంటారు.
ఇక ఇప్పటివరకు తన సంపాదించిన ఆస్తి విషయానికి వస్తే రూ.30 కోట్ల రూపాయల వరకు ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. ఇక ఎక్కువగా ఆడంబరాలకు పోకపోయినా తన దగ్గర మాత్రం మంచి కార్ కలెక్షన్ ఉందని చెప్పడంలో సందేహం లేదు . ఇక ఈమె దగ్గర ఉన్న కార్ కలెక్షన్ విషయానికి వస్తే ఆడి q3 మిక్స్బిషల్ లాన్సర్ ఈవో ఎక్స్ అలాగే మారుతి సుజుకి నెక్సా కార్లు ఈమె కార్ గ్యారేజ్ లో ఉన్నాయి. ఇకపోతే ఈమె ఇల్లు కూడా చూడడానికి చాలా సింప్లిసిటీగా.. లగ్జరీగా కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.