యూట్యూబ్: సుమ నెల సంపాదన ఎంతో తెలుసా..?

-

బుల్లితెర ఇండస్ట్రీపై మకుటం లేని మహారాణిగా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర పై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించే ఈమె సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఇక అంతేకాదు ఒకవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మరొకవైపు బుల్లితెర కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే సుమ కొంచెం సమయం దొరికితే చాలు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు రకాల వీడియోలు చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఉన్నవారు సైతం సుమ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్ లుగా ఉన్నారు అంటే సుమ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చిన సుమ ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో మళ్లీ ఆమె వెండితెర వైపు వెళ్ళనని నిర్ణయం తీసుకుంది. ఇకపోతే యూట్యూబ్ ద్వారా కూడా మంచి పాపులారిటీని అందుకొని ఎక్కువ సబ్స్క్రైబర్లను పొందిన సుమ నెలకు ఎంత సంపాదిస్తుంది అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇకపోతే సుమ ఏదైనా ఫంక్షన్ లేదా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ గా చేయాల్సి వస్తే.. ఒక్క షో లేదా ఈవెంట్ కి సుమారుగా రూ.2.5 లక్షలు వసూలు చేస్తుందని సమాచారం. టాప్ యాంకర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో కూడా బిజీగా ఉంది.

యూట్యూబ్ ద్వారా ఈమెకు నెలకు రూ. 1.80 లక్షలకి పైగా ఆదాయం వస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి లక్షల్లో పారితోషకం తీసుకునే సుమకి యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోతుందంటూ కొంతమంది ఆమెను ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ యూట్యూబ్ ద్వారా ఆమెకు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చినా కూడా కాస్త ఎక్కువగానే కష్టపడుతుందని చెప్పవచ్చు.. ఇక సుమ బాగా పాపులారిటీని సంపాదించుకున్న నేపథ్యంలో.. ఇక ఫాలోవర్స్ కూడా సంపాదించుకున్న నేపథ్యంలో ఈమె పెట్టే ప్రతి వీడియోకి విపరీతమైన వ్యూస్ , లైక్స్ రావడంతో అలా ప్రతినెల ఈమెకు మంచిగా డబ్బులు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news