జగన్ బర్త్ డేకు ‘యాత్ర’ గిఫ్ట్..!

-

బయోపిక్ సినిమాలు సూపర్ హిట్లవుతున్న ఈ టైంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శషి దేవిరెడ్డి, విజయ్ చిల్లా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్సార్ గా మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తుండటం విశేషం.

అసలైతే సినిమా రిలీజ్ 2019 జనవరిలో అనుకోగా డిసెంబర్ 21న వై.ఎస్ జగన్ పుట్టినరోజున యాత్ర సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. వై.ఎస్ బయోపిక్ గా వస్తున్నా ముఖ్యంగా వై.ఎస్.ఆర్ చేపట్టిన పాదయాత్రం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే టైటిల్ కూడా యాత్ర అని పాద ముద్రని ఉంచారు. అసలే రాజకీయాలతో వేడెక్కుతున్న ఈ తరుణంలో యాత్ర సినిమా వై.ఎస్ అభిమానులకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news