ఎన్టీఆర్, చంద్రబాబు బయోపిక్ లుక్ అదుర్స్

-

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈమధ్యనే బాబు లుక్ లో రానా ఫస్ట్ లుక్ అదరగొట్టేసింది. ఇక ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఎన్.టి.ఆర్, చంద్రబాబు అదేనండి రీల్ ఎన్.టి.ఆర్ (బాలకృష్ణ), చంద్రబాబు(రానా) కలిసి ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

చంద్రబాబు భుజాల మీద చేయి వేస్తూ సీరియస్ డిస్కషన్ చేస్తున్న ఎన్.టి.ఆర్ లుక్ బాగుంది. పోస్టర్ చూసి ఒక్క క్షణం నిజంగానే ఎన్.టి.ఆర్, చంద్రబాబు అనుకునే ఛాన్స్ ఉంది. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ మేకోవర్ అద్భుతంగా ఉండగా చంద్రబాబుగా రానా అదిరిపోయేలా ఉన్నాడు. పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్న క్రిష్ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news