స‌ల్మాన్‌ఖాన్ పెళ్లి నాతోనే ఫిక్స్‌… హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

7507

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్ ఇప్ప‌ట‌కి బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గా ఉండిపోయాడు. స‌ల్మాన్ గ‌తంలో చాలా మంది హీరోయిన్ల‌ను పెళ్లి చేసుకుంటాడ‌న్న టాక్ వ‌చ్చినా ఎవ్వ‌రిని చేసుకోలేదు. ఇక గ‌త కొన్నేళ్లుగా సినిమాల్లో స‌ల్మాన్ ప‌ట్టింద‌ల్లా బంగారం అన్న‌ట్టుగా మారిపోయింది. స‌ల్మాన్ న‌టించిన సినిమాలు అన్ని రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో పాటు రికార్డుల మీద రికార్డులు క్రాస్ చేస్తున్నాయి.

Zareen Khan reveals why she wants to marry superstar Salman Khan
Zareen Khan reveals why she wants to marry superstar Salman Khan

ఇదిలా ఉంటే బాలీవుడ్ న‌టి జ‌రీన్ ఖాన్ స‌ల్మాన్ తనను పెళ్లి చేసుకోబోతున్నారని షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈమె ఈ మేరకు ఫన్నీ కామెంట్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆమె స‌ల్మాన్ త‌న‌ను పెళ్లాడుతున్నాడ‌ని చెప్ప‌డంతో పాటు త‌న సినిమాలు, వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన అంశాల‌ను కూడా త‌న‌తో పంచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే విలేక‌రి ఆమెకు ఓ ఇంట్ర‌స్టింగ్ టెస్ట్ పెట్టాడు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని బాంబు పేల్చింది. దీంతో ఇప్పుడు స‌ల్మాన్‌పై జ‌రీన్ చేసిన వ్యాఖ్య పెద్ద బాంబులా పేలింది.

ఇక జ‌రీన్ త‌న‌కు పెళ్లిపై అస్స‌లు నమ్మకం లేదు. ఇంకా చెప్పాలంటే ఇటీవ‌ల కాలంలో పెళ్ల‌నేది త‌న‌కు చాలా కామెడీగా మారిపోయింద‌ని చెప్పింది. ఇక సల్మాన్ – జరీన్‌ జంటగా ‘వీర్‌’ చిత్రంలో నటించారు. జరీన్‌ను తొలుత బాలీవుడ్‌కు పరిచయం చేసింది సల్మాన్‌ ఖానే కావడం విశేషం.