మాల్దీవులకు బియ్యం, చక్కెర ఎగుమతికి ఇండియా గ్రీన్‌సిగ్నల్‌

-

సాధారణంగా ఇండియా-మాల్దీవులు రెండు కూడా మంచి సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవి. అయితే మాల్దీవులు కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ ముయిజ్జు ఎన్నికైనప్పటి నుంచి ఆ దేశం ఇండియాకి దూరమవుతూ చైనాకు దగ్గరవుతుంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా-మాల్దీవుల మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇండియా మానవతా సాయంగా చక్కెర, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలతో సహా నిత్యావసర వస్తువులను పరిమిత స్థాయిలో ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1న ప్రారంభమైన 2024/25 ఆర్థిక సంవత్సరంలో మాల్దీవులకు ఈ వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.

1,09,162 టన్నుల గోధుమ పిండి,1,24,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 64,494 టన్నుల చక్కెర,35,749 టన్నుల ఉల్లిపాయలు, 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, 1 మిలియన్ టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేయడానికి కూడా ఇండియా అనుమతించింది.

Read more RELATED
Recommended to you

Latest news