భక్తి: తులసి మొక్క ఎండిపోతే అశుభమా..? ఏం చెయ్యాలి..?

-

హిందువులు తులసి మొక్కని రోజు పూజిస్తారు. అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఇంటి యొక్క వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే తులసి మొక్క ఇంట్లో ఉంచితే చాలా మంచి కలుగుతుంది. అయితే ఎప్పుడు కూడా తులసి మొక్క ఇంట్లో ఉన్నప్పుడు పచ్చగానే ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాలి. మరి ఇక పూర్తి వివరాలలోకి వెళితే..

tulasi

ఇంట్లో వుండే తులసి మొక్క ఎండిపోతే దాని వల్ల సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా ఎండిపోయి తులసి మొక్క చనిపోతే పిత్రు దోషానికి సంకేతం అవుతుంది. అలానే తులసి మొక్క ఎండిపోవడం వల్ల ఇంట్లో గొడవలు వంటివి కూడా జరుగుతాయి. అయితే తులసి మొక్క ఎండిపోవడం బుధగ్రహానికి సంబంధించినది.

బుధుడు ఏ విధమైన అశుభ ప్రభావాన్ని ఇవ్వబోతున్న తులసి మొక్క ఎండి పోవడం జరుగుతుంది. ఆకస్మాత్తుగా ఎండిపోయి తులసి మొక్క చనిపోతే సమస్యలు కూడా వస్తాయి అని పండితులు చెప్తున్నారు. ఒకవేళ కనుక మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే దానిని అలానే వదిలేయకండి ఆ తులసి మొక్కని నీటిలో పారేసి వెంటనే కొత్త తులసి మొక్క నాటండి. ఎప్పుడూ కూడా తులసి మొక్కను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. కాబట్టి తప్పులేమీ జరగకుండా జాగ్రత్తగా ఉంటే సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news