భోగి పండుగ విశిష్టత తెలుసా మీకు?

-

సంక్రాంతి పండుగ వచ్చింది.. సంబురాలు తీసుకొచ్చింది. అవును.. తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఆంధ్రా, రాయలసీమ ప్రజలు సంక్రాంతిని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం మూడు రోజులే జరుపుకుంటారు.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. సంక్రాంతి అంటేనే గాలిపటాలు, అరిసెలు, చకినాలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, రథం ముగ్గురు, కోడి పందేలు, హరిదాసులు.. ఇవన్నీ ఉంటేనే అది సంక్రాంతి పండుగ అవుతుంది. పండుగ మొదటి రోజును భోగీ అని… రెండో రోజును సంక్రాంతి అని పిలుస్తారు. ఇక చివరి రోజును కనుమ అని.. కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే నాలుగు రోజును ముక్కనుమ అని పిలుస్తారు.

image source : officeholidays

మకర సంక్రాంతి కంటే ముందు రోజు భోగి పండుగ జరుగుతుంది. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజని అర్థం. సంక్రాంతి సమయానికే పంట అంతా చేతికొస్తుంది. పంటను ఇంటికి తరలించే సమయం ఇది. అందుకే… భోగ భాగ్యాలతో అనుభవించాలంటూ భోగి పండుగను జరుపుకుంటారు. భోగి రోజున కుటుంబ సభ్యులంతా ఉదయమే నిద్ర లేస్తారు. స్నానం చేసి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని మంటల ద్వారా కొత్త ఉత్తేజాన్ని నింపుకుంటారు. అంతే కాదు.. ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో వేసి… ఇంట్లోని చెడును బయటికి పంపించి… మంచిని స్వాగతిస్తారు. అంతే కాదు.. ఆ భోగి మంటల ద్వారా మనలో ఉన్న చెడును, బద్దకాన్ని భోగిమంటల్లో వేసి.. ఇవాళ్టి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని కోరుకుంటారు. అదే.. ఈ భోగి పండుగ విశిష్టత. దాంతో పాటు.. భోగి రోజున ఇంట్లోని పిల్లల తల మీద రేగు పండ్లు పోసి వాళ్లలోని చెడును తొలగిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version